వచ్చే పదేండ్లు కాంగ్రెస్దే అధికారం : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వచ్చే పదేండ్లు కాంగ్రెస్దే అధికారం : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నార్కెట్​పల్లి, వెలుగు : వచ్చే పదేండ్లు కాంగ్రెస్ దే అధికారమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నార్కెట్​పల్లి మండలం చెరువుగట్టు గ్రామ నూతన సర్పంచ్ కృష్ణయ్య బుధవారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

 ఈ సందర్భంగా కృష్ణయ్యను శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యమన్నారు. తెలంగాణ పల్లెలు దేశానికి రోల్ మోడల్ గా మారనున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కలిసి వారిలో గ్రామ అధ్యక్షుడు వాడాల రమేశ్, కాంగ్రెస్ నాయకులు గడుసు శశిధర్ రెడ్డి, రేగట్టి నవీన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రేగట్టి నరసింహారెడ్డి, చంద్రయ్య, దొడ్డి యాదయ్య, సాయి ఉన్నారు.